రోజుకు 9 వేల ఆర్టీపీసీఆర్ టెస్టులు: గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్

జిల్లాకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు

Guntur District Collector Vivek Yadav at a press conference
Guntur District Collector Vivek Yadav at a press conference

Guntur: కోవిడ్ -19 నియంత్రణ, నివారణ చర్యలు సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని, ఒక విజన్, లీడర్ షిప్ తో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్లానింగ్ స్ట్రేటజీ తో నడిపిస్తున్నారని, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జారీ చేస్తున్న సూచనలకు
అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేస్తుందని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం కలక్టరేట్ లోని ఎస్. ఆర్. శంకరన్ హాల్ ఎదురు గా వేసిన షామియానాలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో సెకండ్ వేవ్ రెండు వారాల క్రిందట ప్రారంభమైనదని, కేసులు రోజు రోజుకు గత 24 గంటల్లో పెరుగుతున్నాయని, 2072 కేసులు నమోదు అయ్యాయని, గుంటూరు అర్బన్ పరిధిలో 702, తాడేపల్లి,
మంగళగిరి మునిసిపాలిటిలో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు. పాజిటివ్ కేసులు రాగానే కాంటాక్ట్స్ ట్రేసింగ్ చేయడం జరుగుతుందని, స్వల్ప లక్షణాలున్న వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచుతున్నామని, ఇంట్లో వసతులు సరిగా లేకపోతే వారిని కోవిడ్ కేర్ సెంటర్లో చేర్పించడం జరుగుతున్నదన్నారు.

కేసు తీవ్రతను బట్టి హాస్పిటల్ లో చేరుస్తున్నామన్నారు. రోజుకు తొమ్మిది వేల ఆర్ టీ పీ సీ ఆర్ టెస్టులు నిర్వహిస్తున్నామని, యాంటి జెన్ టెస్టులు కూడా వచ్చాయన్నారు. పెండింగ్ లో ఉన్న కరోనా నిర్ధారణ పరీక్షలను 24 గంటల్లో పూర్తి చేస్తామన్నారు. వైరస్ నిర్ధారణ పరీక్ష జరిగిన 24
గంటల్లో ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏడు కోవిడ్ కేర్ సెంటర్లలో మూడు వేల బెడ్లు అందుబాటులో వున్నాయని, అందులో 1181 మంది పాజిటివ్ వ్యక్తులు ఉన్నారన్నారు. కోవిడ్ కేర్సెం టర్లలో డాక్టర్ల బృందం నిరంతరం పర్యవేక్షిస్తు ఉంటుందని, రోగులకు మంచి పౌష్టికాహారం, త్రాగునీరు, శానిటేషన్, మందులు, అందించడం జరుగుతున్నదన్నారు. 24 గంటలు అంబులెన్స్ సేవలు అందుబాటులో
వుంచడం జరిగిందన్నారు. ప్రతి కోవిడ్ కేర్ సెంటర్ కు ఒక నోడల్ అధికారిని నియమించడం జరిగిందన్నారు. జిల్లాలోని 60 కోవిడ్ ఆసుపత్రులలో ఆరు వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయని, వీటిలో 846 ఐసియు బెడ్లు, 3018 నాన్ ఐసియు ఆక్సిజన్ బెడ్లు, ఆక్సిజన్ లేని నాన్ ఐసియు బెడ్లు 2241 అందుబాటులో ఉన్నాయన్నారు. 40 బెడ్ల సామర్ధ్యం ఉన్న ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులుగా మార్చడం వలన
మరొక మూడు వేల బెడ్లు అందుబాటులోకి రానున్నాయన్నారు.

బెడ్ల కొరత ఏర్పడుతున్నందున స్వల్ప లక్షణాలతో ఆసుపత్రులలో చేరిన వారిని పరీక్షించి వారిని కోవిడ్ కేర్ సెంటర్స్ కు తరలిస్తామన్నారు. జిల్లాలో
10,852 యాక్టివ్ పాజిటివ్ కేసులున్నాయని, 90 శాతం కేసులు స్వల్ప లక్షణాలు కలిగి వున్నవేనని జిల్లా కలెక్టర్ తెలియజేసారు. కరోనా వైరస్ తో భయపడాల్సిన అవసరం లేదని, క్రమబద్దమైన చికిత్స, బాగా రెస్ట్తీ సుకుంటు మంచి పౌష్టికాహారం తీసుకుంటే సరిపోతుందన్నారు. కొద్దిపాటి లక్షణాలు కనబడగానే ఆక్సిజన్బె డ్ల కోసం ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా వుందని, వీరు హోమ్ ఐసోలేషన్ లో వుండి చికిత్స తీసుకోవాలన్నారు. ఆసుపత్రులలో బెడ్లు, ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇంజక్షన్లకు కొరత లేదన్నారు. ఆరోగ్య శ్రీ, నాన్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులలో చికిత్సకు రెట్లు పెంచేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని, చికిత్సకు అవసరమయ్యే ధరలను రోగులకు అందుబాటులో వుండే విధంగా ఆసుపత్రులలో ప్రదర్శించాలన్నారు.

జిల్లాలో ఆక్సిజన్ నిల్వలు సరిపడా వున్నాయని, రోజుకు 40 నుండి 43 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తున్నదని, సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో మానిటరింగ్సె ల్ ఏర్పాటు చేసి ప్రతిరోజు ఏ ఆసుపత్రికి ఎంత మేరకు ఆక్సిజన్ అవసరం ఉన్నదో తెలుసుకుని పంపడం
జరుగుతుందన్నారు. కొన్ని చోట్ల ఆక్సిజన్ వృధా బాగా జరుగుతున్నదని, కొంతమంది ఆక్సిజన్ అవసరం లేని వారికి అందిస్తున్నారని, ఆక్సిజన్ సరైన పద్దతి ప్రకారం వినియోగించుకోకపోతే ఎంత ఆక్సిజన్ అయినా సరిపోదన్నారు. కరోనా వైరస్ పై ఎటువంటి సందేహాలు, సమస్యలు వుంటే 104 నెంబర్ కు తెలియజేయాలన్నారు

45 సంవత్సరాల వయస్సు పైబడి వారు దగ్గరలో ఉన్నవ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుతున్నానన్నారు. కోవిడ్ మహమ్మారినియంత్రణలో భాగంగా కొన్ని అసోసియేషన్స్ తమ వ్యాపార లావాదేవీల సమయాన్ని తగ్గించుకునిపాటిస్తున్నాయని, కరోనా వైరస్ నివారణకు ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తూ ప్రభుత్వానికిసహకరించాలన్నారు. సంయుక్త కలెక్టర్ ( రెవిన్యూ, రైతు భరోసా ) ఏ.ఎస్. దినేష్ కుమార్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. జే.యాస్మిన్ పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/