తమిళ ద‌ర్శ‌కుడు కె వి ఆనంద్‌ మృతి

చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం

Film Director KV Anand -File
Film Director KV Anand -File

Chennai: ప్ర‌ముఖ తమిళ ద‌ర్శ‌కుడు కె వి ఆనంద్‌ (54) గుండెపోటుతో ఇవాళ మృతి చెందారు. డబ్బింగ్ చిత్రాలతో తెలుగువారికి సుపరిచితుడైన కేవీ ఆనంద్ జీవాతో ‘రంగం’, సూర్యతో’ బ్రదర్స్’, ‘వీడొక్కడే’, ‘బందోబస్త్’ సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రేమ‌దేశం, ఒకే ఒక్క‌డు, ర‌జినీకాంత్ శివాజీ, బాయ్స్ వంటి చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌ గా కూడా ప‌నిచేశారు. మొదట్లో ఫోటో జర్నలిస్ట్‌ గా పనిచేసిన కె వి ఆనంద్ ఆ తర్వాత తమిళ సినిమా ‘క‌ణా కండేన్’ తో ద‌ర్శ‌కుడిగా మారారు. ఆపై సూర్యతో అయాన్ తెలుగులో ‘వీడొక్కడే’ చిత్రానికి దర్శకత్వం తో డైరెక్టర్ గా మారారు. ఆనంద్ మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/