రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోంది

విధులు నిర్వర్తించకుండా తనను పోలీసులు గృహనిర్బంధం చేయడం ఎంటి?

kesineni nani
kesineni nani

అమరావతి: రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమం ఉద్ధృతం కావడంతో ఎక్కడికక్కడ టిడిపి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మహిళల పాదయాత్రకు టిడిపి నేతలు హాజరయ్యే అవకాశం ఉండటంతో విజయవాడ నగరంలో ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులును పోలీసులు గృహనిర్భందం చేశారు. ఈ సందర్భంగా కేశినాని నాని మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామో పాకిస్థాన్‌లో ఉన్నామో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు నిర్వర్తించకుండా తనను పోలీసులు గృహనిర్భందం చేయడం ఏంటని కేశినేని ప్రశ్నించారు. రాజధాని కోసం శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాన్ని అడ్డుకోవడం మంచి పద్దతి కాదన్నారు. అణచివేసే కోద్దీ ఉద్దమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/