వాట్సాప్ లో కొత్త ఫీచర్..ఇక ఆ ఇబ్బంది మీకు లేనట్లే

WhatsApp

ప్రస్తుతం చిన్న , పెద్ద అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అకౌంట్ లను వాడుతున్నారు. ఉదయం లేచినదగ్గరి నుండి నిద్రపోయేవరకు అనుక్షణం వాట్సాప్ , ఇన్స్టర్ తదితర సోషల్ మీడియా ఖాతాలలో బిజీ గా ఉంటున్నారు. కాగా ఇప్పుడు వాట్సాప్ యూజర్స్ కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మనలో చాలామంది వాట్సాప్ చాటింగ్ చేస్తూ పొరపాటున వేరే మెసేజ్ లు పంపిస్తుంటారు. వాటిని డిలిట్ చేయాలనే తొందరలో ‘డిలిట్ ఫర్ ఎవ్రీవన్’ నొక్కబోయి ‘డిలిట్ ఫర్ మి’ నొక్కుతుంటాం. దీనివల్ల ఒకరికి పంపబోయే మెసేజ్ లు మరొకరికి పంపించి ఇబ్బందులో పడుతుంటారు.

ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. మెసేజ్ ని డిలిట్ చేసిన తర్వాత ‘డిలిట్ ఫర్ మి’, ‘డిలిట్ ఫర్ ఎర్వీవన్’ అని కనిపిస్తుంది. ఇకనుంచి వాటితో పాటు ‘అన్ డూ’ అని కనిపిస్తుంది. దాన్ని నొక్కితే మెసేజ్ డిలిట్ అవ్వదు. ప్రస్తుతం వాట్సాప్ బీటా టెస్టింగ్ లో ఉన్న ఈ ఫీచర్ త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ లలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.