దేశంలో కొత్తగా 1,216 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో కొత్తగా 1,216 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,58,365కి చేరింది. ప్రస్తుతం దేశంలో 15,705 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 18 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,479కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98. 78శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.69 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/