మరికాసేపట్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ మరికాసేపట్లో మొదలు కానుంది. నిన్న ఆరు గంటల పాటు ఈడీ అధికారులు రోహిత్ రెడ్డి ని విచారించడం జరిగింది. ఈరోజు రెండో సారి ఆయన్ను విచారించనున్నారు. నిన్న విచారణ పూర్తి కాగానే మీడియా తో రోహిత్ మాట్లాడారు.

ఈడీ అధికారులు తనను కేవలం బయోడేటా గురించి అడిగారని .. విచారణ కోసం మళ్లీ రేపు ఉదయం 10.30 కి రమ్మని చెప్పారని తెలిపారు.ఎలాంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్‌ గురించి ప్రశ్నించలేదని వివరించారు. తనపై వస్తున్న ఆరోపణల గురించి ఎలాంటి ప్రశ్నలు అడుగలేదన్నారు. ఈ క్రమంలోనే తానే అధికారులను ఎదురు ప్రశ్నించానని రోహిత్ రెడ్డి తెలిపారు. తనను ఏ కేసు గురించి విచారిస్తున్నారని అధికారులను అడిగానని.. కానీ వాళ్లు ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదన్నారు. మళ్లీ ఈరోజు విచారణకు రమ్మన్నట్లు తెలిపారు. వ్యాపార లావాదేవీలు అడిగి తెలుసుకున్నారన్న రోహిత్ రెడ్డి… మనీలాండరింగ్ ఇష్యూపై ఎలాంటి వివరాలు అడగలేదన్నారు. ఏమి అడిగినా సహకరించాలని మాత్రమే అంటున్నారన్నారు.