నా బ్యాటింగ్‌కు స్ఫూర్తి ఇతని పాత్ర : సెహ్వగ్‌

ట్విట్టర్‌ వేదికగా సెహ్వగ్‌ వెల్లడి

sehwag
sehwag

దిల్లీ: భారత క్రికెట్‌ టీం లో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ అనగానే గుర్తుకు వచ్చే పేరు వీరేంద్ర సెహ్వగ్‌. ప్రత్యర్ధులు వేసే ఎలాంటి బంతిని అయిన సరే ఎడాపెడా బాదుతూ.. బౌండరీ దాటించేస్తుంటాడు. అలాంటి సెహ్వగ్‌ బ్యాటింగ్‌కు సంబందించి ఒక వ్యక్తి నుంచి స్ఫూర్తిని పొందాడట. అతడే రామాయణంలో వాలి కుమారుడైన అంగధుడు. అని సెహ్వగ్‌ తెలిపాడు. ప్రస్తుతం దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న రామాయణ్‌ సీరియల్లో ఒ సన్నివేశాన్ని షేర్‌ చేశాడు. అది రావణుడి ఆస్థానంలో నిలబడి ఉన్న అంగదుడి కాలును కదిపేందుకు రావణ సైన్యంలోని పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్న ఫోటో. అంతేకాదు అందకు సంబందించి ఓ కామెంట్‌ను కూడా జత చేశాడు అతని కాలును కదపడమనేది కష్టమైనదే కాదు… అసంభవం కూడా అని పోస్ట్‌ చేశాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/