కంట్రోల్‌ రూమ్‌ ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు

-కమిషనర్‌ అనురాధ ఆదేశం

GMC Commissioner Anuradha
GMC Commissioner Anuradha

Guntur: నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌కు అందే ఫిర్యాదులను ఎప్పటికపుడు సంబంధిత విభాగానికి పంపాలని, వాటి పరిష్కారానికి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, నగర కమిషనర్‌ చల్లా అనురాధ స్పష్టం చేశారు.

సోమవారం ఉదయం కంట్రోల్‌రూమ్‌ ను కమిషనర్‌ తనిఖీ చేసి ప్రతిరోజు ఎన్ని ఫిర్యాదలు వస్తుందీ, వాటి పరిష్కార తీరుని, సిబ్బంది హాజరు పరిశీలించారు.

ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, కంట్రోల్‌రూమ్‌ కు అందే ఫిర్యాదలనుసమస్యలను క్రమ పద్ధతిలో రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు..

ఫిర్యాదు పరిష్కారం అయ్యాక సంబంధిత ఫొటోలు, సమాచారంను ఫిర్యాదుదారునికి తెలియజేయాలన్నారు.

కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఫిర్యాదు తీసుకునేటపుడు, సావధానంగా, పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు..

నగర ప్రజలనుద్దేశించి కమిషనర్‌ మాట్లాడుతూ, ఆయా ప్రాంతాల్లో ప్రజలు సమస్యలను నగరపాలక సంస్థ కంట్రోల్‌ రూమ్‌ 0863-2345103, 2345104 నంబర్లకు ఫోన్‌చేసి తెలియజేయాలన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/