కరోనా వైరస్‌ విజృంభణ ఎన్నో సవాళ్లను విసిరింది

మనపైనే మనం ఆధారపడి జీవించాలి 

PM Narendra Modi Video Call With Sarpanches
PM Narendra Modi Video Call With Sarpanches

న్యూఢిల్లీ: నేడు పంచాయతీ రాజ్‌ దినోత్సవం పురస్కరించుకుని  ప్రధాని నరేంద్రమోడి దేశంలో సర్పంచ్‌లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. ఈసందర్భంగా ఆయన ఈగ్రామ స్వరాజ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్ ప్రారంభించారు. వీటి ద్వారా ఎన్నో సేవలు పొందవచ్చని తెలిపారు. దీని వల్ల బ్యాంకు రుణాలు తీసుకోవడం చాలా సులభమని చెప్పారు. ఈ పోర్టల్‌ వల్ల గ్రామాల్లో సమస్యలు గుర్తించి, పరిష్కరించడం సులభమని మోదీ తెలిపారు. దేశంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలంగా ఉంటేనే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రస్తుతం లక్షా 25 వేల పంచాయతీల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుతున్నాయని వివరించారు ‘కరోనా వైరస్‌ విజృంభణ ఎన్నో సవాళ్లను విసిరింది. జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల నుంచి మనం ఎల్లప్పుడూ నేర్చుకోవాల్సి ఉంటుంది. పరిస్థితులు దుర్భరంగా ఉన్న సమయంలో మనం ఎలా వ్యవహరిస్తామన్న విషయాన్ని కరోనా విపత్కర పరిస్థితులు మనకు గుర్తు చేశాయి’ అని మోడి చెప్పారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/