సజ్జనార్‌ పిలుపుకు స్పందించిన దాతలు

నిన్న 551 మంది రక్తదానం చేసినట్లుగా అధికారల వెల్లడి

cp. sajjanar
sajjanar

హైదరాబాద్‌: ఈనెల 12న సిపి సజ్జనార్‌ నారాయణగూడ ఐపిఎం కేంద్రానికి వెళ్లి రక్త దానం చేసిన సందర్బంగా దాతలు ముందుకు రక్తదానం చేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో తలసేమియా వ్యాధి గ్రస్తులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. సజ్జనార్‌ ఇచ్చిన పిలుపుకు స్పందించి 551 మంది గురువారం రక్తదానం చేశారని సైబరాబాద్‌లోని కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌చార్జి, అడిషనల్‌ డిసిపి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కొందరు దాతలు వారి సొంత వాహనాలలో వచ్చి రక్తం దానం చేశారు. అవసరమైన వారికి వాహన సౌకర్య కల్పించామని ఆయన పేర్కోన్నారు. ఎవరైనా రక్తదానం చేయాలనుకుంటే దాతలు 9490617440, 9490617431 నంబర్లకు సంప్రదించాలని, అవసరమైతే వారికి వాహన సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/