నారా లోకేష్ ను కలిసిన బండ్ల గణేష్

ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 అసెంబ్లీ , 21 పార్లమెంట్ స్థానాలు గెలిచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇక మంగళగిరి నుండి భారీ మెజార్టీ తో నారా లోకేష్ విజయం సాధించడం పట్ల రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈరోజు పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు నేరుగా లోకేష్ ను కలిసి విషెష్ అందించారు. సినీ రంగం నుంచి లోకేశ్ ను కలిసిన వారిలో నిర్మాత బండ్ల గణేష్, హీరో నిఖిల్ తదితరులు ఉన్నారు. వారు లోకేశ్ ని కలిసి అభినందనలు తెలిపారు. ఉండవల్లి నివాసంలో ఈ రోజు సుమారు 2 వేల మంది కార్యకర్తలను కలిసిన లోకేశ్ అందరితో ఫోటోలు దిగారు.

ఇక జూన్ 12 న చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మొదట మంగళగిరి ఎయిమ్స్ స్థలం బాగుంటుందని భావించినప్పటికీ.. దీని కంటే ఐటీ పార్క్ స్థలం అనువైనదిగా టీడీపీ నేతలు భావించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ తో పాటు NDA నేతలు , ఇతర పార్టీల సీఎం లు హాజరు కాబోతున్నారు.