ఐకెపి అధికారులపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆగ్రహం

తెలంగాణ లో ధాన్యం కొనుగోలు జోరుగా నడుస్తుంది. ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆగ్రహం శశాంక పరివేక్షించి ఆగ్రహం వ్యక్తం చేసారు. కొనుగోలు కేంద్రాలు అస్తవ్యస్తంగా అధ్వానంగా ఉన్నాయని ఐకెపి అధికారులపై మండి పడ్డారు. రైతులంటే అంత అలుసా అన్నారు. తక్షణమే కొనుగోలు సంబంధించిన టెండర్లను రద్దు చేయాలని ఆదేశించారు.

ఇక జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నగూడూరు గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతున్నది? మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఒక మహిళా రైతు వద్ద నుంచి ఆమె తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ తెరిచి అందులో ఏముందో చూసి… తెచ్చింది అంతా నువ్వే తిన్నావా? నాకేమీ ఉంచ లేదా? అంటూ మంత్రి రైతు కూలీలతో కాసేపు ముచ్చటించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకెళ్లడానికి లారీలు రావడం లేదని అక్కడి రైతులు చెబుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యను పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.