మోడీ కూడా ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి వైదొలిగి మ‌రో నేత‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించాలిః తేజ‌స్వి యాద‌వ్

tejashwi yadav
tejashwi yadav

న్యూఢిల్లీః ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌ప్పుడు విధానాల కార‌ణంగా 25 కోట్ల మంది యువత వ‌య‌సు మీర‌డంతో పాటు నిరుద్యోగం పెచ్చుమీరింద‌ని బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్ అన్నారు. 75 ఏండ్ల త‌ర్వాత నేత‌లు క్రియాశీల‌క రాజ‌కీయాల‌ను విడిచి స‌ల‌హా మండ‌లికి వెళ్లాల‌ని ప్ర‌ధాని స్వ‌యంగా ఓ విధానాన్ని తీసుకొచ్చార‌ని ఆయ‌న కూడా ఇదే నియ‌మాన్ని పాటిస్తార‌ని తాను భావిస్తున్నానని చెప్పారు.

అగ్నివీరులు 22 ఏండ్ల‌కే రిటైర్ అవుతున్న క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ కూడా తాను రూపొందించిన విధానానికి క‌ట్టుబ‌డి ఉంటార‌ని అనుకుంటున్నాన‌ని తేజ‌స్వి యాద‌వ్ పేర్కొన్నారు. మోడీ కూడా ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి వైదొలిగి మ‌రో నేత‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని సూచించారు.