ఇటలీ, యూకే పర్యటన ముగించుకొని ఢిల్లీ కి చేరుకున్న మోడీ

భారత ప్రధాని మోడీ ఢిల్లీకి చేరుకున్నారు. ఇటలీ, యూకే పర్యటనకు వెళ్లిన మోడీ..ఆ పర్యటన ముగించుకొని ఢిల్లీకి చేరుకున్న మోడీకి అధికారులు స్వాగతం పలికారు. ఈ పర్యటన లో జీ20 , కాప్​26 ప్రపంచ వాతావరణ సదస్సుల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కర్బన ఉద్గారాలను తగ్గించే విషయంలో కీలక ప్రకటన చేశారు మోదీ.

2070 నాటికి కర్బన ఉద్గారాల రహిత(నెట్ జీరో) దేశంగా భారత్ అవతరిస్తుందని తెలిపారు. అంతకుముందు, కరోనా పోరాటంలో ప్రపంచానికి బాసటగా నిలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ జీ20 సదస్సులో పేర్కొన్నారు. 2022 చివరి నాటికి భారత్​ 500 కోట్ల కొవిడ్​ టీకా డోసులను ఉత్పత్తి చేస్తుందని చెప్పారు.

గ్లాస్గోలో మంగళవారం జరిగిన కాప్‌-26 సదస్సు సందర్భంగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద సాఫ్ట్‌వేర్‌ సంస్థ కో ఫౌండర్‌ బిల్‌ గేట్స్‌తో ప్రధాని మోడీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారతదేశంలో పెటుబడులు, ఉపాధి తదితర అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. వాతావరణ మార్పులను తగ్గించడంలో కృషి చేయడంతోపాటు సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించిటన్లు భారత ప్రధాని కార్యాలయం తెలిపింది.