ప్రధాని మోడి వ్యక్తిగత ట్విటర్‌ ఖాతా హ్యాక్‌

దర్యాప్తు ప్రారంభించిన ట్విట్టర్

pm modi
pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి వ్యక్తిగత ట్విట్టర్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ఈ తెల్లవారుజామున హ్యాక్‌కు గురయ్యాయి. ఈ విషయాన్ని ట్విట్టర్ నిర్ధారించింది. ప్రధాని ట్విట్టర్ ఖాతా ఈ తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో హ్యాక్ అయినట్టు తెలిపింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్టు ట్విట్టర్ ప్రతినిధులు పేర్కొన్నారు. హ్యాక్ అయిన మోడి ఖాతాకు 2.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే మోడి అకౌంట్‌ను సెక్యూర్ చేసిన‌ట్లు కూడా ట్విట్ట‌ర్ సంస్థ వెల్ల‌డించింది. ట్విట్ట‌ర్ సంస్థ ప్ర‌తినిధి ఈ సంఘ‌ట‌న‌పై స్పందిస్తూ.. హ్యాకింగ్ గురించి తెలుసుకున్నామ‌ని, అకౌంట్‌ను మ‌ళ్లీ సెక్యూర్ చేశామ‌ని, ఈ సంఘ‌ట‌న‌ను నిరంతరం ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని, అయితే ప్ర‌ధానికి చెందిన ఇత‌ర అకౌంట్లపై ప్ర‌భావం ప‌డిందా అన్న విష‌యం త‌మ‌కు తెలియ‌ద‌ని అన్నారు.

కాగా ఇటివల అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిలియనీర్ ఎలాన్ మస్క్ వంటి వారి ట్విట్టర్ ఖాతాలు హ్యాక్‌కు గురవడం సంచలనమైంది. 


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/