మంత్రి పేర్ని నాని కాన్వాయిని అడ్డుకున్న జనసేన కార్యకర్తలు

వైసీపీ మంత్రి పేర్ని నాని కి జనసేన కార్య కర్తల సెగ తగిలింది. గత నాల్గు రోజులుగా నాని vs జనసేన వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ చేసిన కామెంట్స్ పట్ల పేర్ని నాని పవన్ ఫై మాటల తూటాలు పేలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తణుకు ప్రాంతంలో మంత్రి పేర్ని నాని కాన్వాయి ని జనసేన నేతలు , కార్య కర్తలు అడ్డుకున్నారు.

పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను మంత్రి పేర్ని నాని వెనక్కి తీసుకోవాలని అలాగే క్షమాపణలు చెప్పాలని నిరసనకు దిగారు. దీంతో తణుకు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం జనసేన పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి… మంత్రి కాన్వాయ్ కి దారిని సుగమం చేశారు.