రేపు, ఎల్లుండి తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్: రేపు, ఎల్లుండి తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపుగా తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు పేర్కొంది. నేడు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని, బుధ, గురువారాల్లో మాత్రం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

ఇక, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నిన్న తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా నల్లవెల్లిలో అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/