ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం

AP-Assembly-Speaker-Seetharam
AP-Assembly-Speaker-Seetharam

ఏపీలో రాజకీయాలు ఎంత వేడెక్కాయి తెలియంది కాదు..రాష్ట్రంలో భారీ వర్షాల గురించి మాట్లాడుకోకుండా..ఎపి అసెంబ్లీ లో చంద్రబాబు ను వైసీపీ నేతలు అవమానించిన దానిగురించి మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు , ఆయన భార్య భువనేశ్వరి లపై దారుణంగా మాట్లాడారు.

అసెంబ్లీలో కొడాలి నాని, అంబటి రాంబాబులు మాధవరెడ్డి హత్య అంటూ పరోక్షంగా బాబు భార్య భువనేశ్వరి గురించి కామెంట్ చేశారు. అయితే మైక్‌లో కాకుండా…వెనుక కూర్చుని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి…లోకేష్ ఎలా పుట్టాడో తెలుసా చంద్రబాబు అని మాట్లాడటం…డి‌ఎన్‌ఏ టెస్ట్ చేయించుకో అని మాట్లాడిన వాయిస్ బయటకొచ్చింది. ద్వారంపూడి మాటలు…టీడీపీ ఎమ్మెల్యేలు ఫోన్లలో రికార్డు చేసిన వీడియోల్లో వినిపించాయి. ఇక వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ కు చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత నందమూరి ఫ్యామిలీ సభ్యులు , టీడీపీ నేతలు , కార్యకర్తలు వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలోకి సభ్యులు సెల్‌ఫోన్లు తీసుకురావద్దని స్పీకర్ ఆదేశించారు. భువనేశ్వరి వ్యవహారం సంబంధించే స్పీకర్ ఈ ఆదేశం జారీ చేసారని అంటున్నారు.