బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాలికి గాయమైంది. దీంతో మూడు వారాల పాటు ఆమెను రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. ఈ విషయాన్నీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఏదైనా సహకారం లేదా సమాచారం కోసం తన కార్యాలయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

కవిత కాలుకు గాయం అయిందన్న వార్త విన్న ఆమె అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు, నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత పలుమార్లు ఈడీ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే.