ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌.. ఓటేసిన ప్ర‌ధాని మోడీ

Voting has begun for the Vice-Presidential elections, with Prime Minister Narendra Modi casting his vote

న్యూఢిల్లీః నేడు ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు పోలింగ్ ప్రారంభ‌మైంది. ఈ సందర్భంగా ప్ర‌ధాని మోడీ తన త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. పార్ల‌మెంట్‌లో ఏర్పాటు చేసిన బూత్‌లో ఆయ‌న ఓటేశారు. ఎంపీలు కూడా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. ఎన్డీఏ అభ్య‌ర్థిగా జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌, విప‌క్షాల అభ్య‌ర్థిగా మార్గ‌రేట్ అల్వాలు పోటీప‌డుతున్నారు. అయితే ధ‌న్‌క‌ర్ ఈజీగా గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి. ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నున్న‌ది. 780 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. దీంట్లో 543 మంది లోక్‌స‌భ‌, 245 మంది రాజ్య‌స‌భ ఎంపీలు ఉన్నారు. అయితే 36 మంది తృణ‌మూల్ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉండ‌నున్నారు. రాజ్య‌స‌భ‌లో 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో 744 మంది ఎంపీలు ఓటు వేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర స‌మితితో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆమ్ ఆద్మీ పార్టీ, శివ‌సేన ఉద్ద‌వ్ పార్టీలు మార్గ‌రేట్ అల్వాకు మ‌ద్ద‌తు ఇస్తున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/