ఎంపీ అరవింద్ ను చెప్పుతో కొడతానంటూ హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత

kavitha

నిజామాబాద్ బిజెపి ఎంపీ అరవింద్ ను టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే నిజామాబాద్ సెంటర్ లో చెప్పుతో కొడతానంటూ వార్నింగ్ ఇచ్చింది. నిజామాబాద్ పేరును అరవింద్ పాడుచేస్తున్నారని ఆగ్రహ వ్యక్తం చేసారు. పార్లమెంటులో అరవింద్ పెర్‌ ఫార్మెన్స్ సున్నా.. నేను కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఖర్గేతో మాట్లాడినట్టు అరవింద్ చెబుతున్నారని ఓ రేంజ్‌ ఓ ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ తో కలిసి గెలిచింది నువ్వు.. బురదమీద రాయి వేయకూడదని ఊరుకున్నా.. రాజకీయాలు చెయ్.., పిచ్చి వేషాలు వేయకు అని హెచ్చరించింది.

నిన్న గురువారం అరవింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ , ఫై ఎమ్మెల్సీ కవిత ఫై పలు ఆరోపణలు చేసారు. కవిత ను కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారని.., అందుకోసం ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చే కార్యక్రమానికి ఆమెకు ఆహ్వానం అందలేదని.., దీంతో కవిత అలిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసిందని అర్వింద్ ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చనిపోయినప్పుడు కవితను తన వెంటే తొడ్కొని యూపీకి వెళ్లారన్నారు. తన కూతురు తన వెంటే ఉందని చెప్పేందుకు కేసీఆర్‌ను ఆమెను యూపీకి తీసుకెళ్లారని చెప్పారు. కవితను తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని.., రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటంబం భ్రష్టుపట్టించదని ఆయన మండిపడ్డారు.

దీనిపై ఈరోజు కవిత మీడియా సమావేశం ఏర్పటు చేసి అరవింద్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజామాబాద్ పేరును అరవింద్ పాడుచేస్తున్నారని నిప్పులు చెరిగారు. పార్లమెంటులో అరవింద్ పెర్‌ ఫార్మెన్స్ సున్నా.. నేను కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఖర్గేతో మాట్లాడినట్టు అరవింద్ చెబుతున్నారని ..అసలు కాంగ్రెస్ తో కలిసి గెలిచింది నువ్వు అంటూ కవిత ఫైర్ అయ్యారు. అరవింద్ బురద లాంటోడని , బురదమీద రాయి వేస్తే మన బట్టలే పాడైపోతాయని కవిత అన్నారు. రాజకీయాలు చెయ్.., పిచ్చి వేషాలు వేయకు అని వార్నింగ్ ఇచ్చింది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే నిజామాబాద్ సెంటర్ లో చెప్పుతో కొడతానంటూ వార్నింగ్ ఇచ్చింది.

మరోవైపు కవిత ఫై అరవింద్ చేసిన కామెంట్స్ పట్ల టిఆర్ఎస్ కార్య కర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. బంజారాహిల్స్ లోని అర్వింద్ నివాసంలోకి చొరబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇంట్లోని ఫర్నిచర్ ధ్వసం చేసారు. పార్కింగ్ లో ఉన్న కార్ అద్దాలు పగలగొట్టి, నానా బీబత్సం చేసారు. టిఆర్ఎస్ కార్య కర్తలు దాడి చేస్తున్న సమయంలో అరవింద్ ఇంట్లో లేరు.