ప్రధాని మోడీ యువతను పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి ప్రధాని మోడీ ఫై నిప్పులు చెరిగారు.దేశంలో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉంది. ఇది మూడు నెలల గరిష్ట స్థాయి.. ! కానీ యువత పట్ల ఏమైనా ఆందోళన, యువత శక్తి, సామర్థ్యాలను ఉపయోగించుకునే కృషి ఏమైనా చేస్తున్నారా?.. నేడు భారతదేశంలో ఉన్న వాస్తవం ఏంటంటే.. నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవు.. కానీ డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం ఉంది.’ అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

మోసపూరిత హామీలతో యువతను కూడా దగా చేశారని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైందంటూ ట్వీట్ చేశారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని నిలదీశారు. అసలు వాటిని భర్తీ చేసే ఉద్దేశం కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవు.. కానీ డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం ఉందంటూ ట్వీట్‌ చేశారు.