కడప దర్గాను సందర్శించిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్..శుక్రవారం కడప లోని కడప దర్గాను సందర్శించారు. అనిల్‌తో పాటు ఆయన సోదరుడు కిరణ్ కుమార్ కూడా ఉన్నారు. దర్గాలో అనిల్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాంప్రదాయ తలపాగా చుట్టి ప్రార్థనలు నిర్వహించారు.

మత పెద్దలు అనిల్ కుమార్, కిరణ్ కుమార్‌లకు ఘన స్వాగతం పలికారు. దగ్గరుండి వారిని దర్గాలోకి ఆహ్వానించారు. కడప దర్గా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు కడప దర్గాను దర్శించుకుంటూ ఉంటారు. వీరికి మత పెద్దలు సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలుకుతారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన కడప దర్గాను అనిల్ కుమార్ సందర్శించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ అల్లుడు రాకతో కడపలో సందడి వాతావరణం నెలకొంది.

ఇదిలా ఉంటె ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఈడీ విచారణకు స్వయంగా ఆమె హాజరయ్యారు.