తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరేనా..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల సంబరాలు మొదలయాయ్యి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబదించిన షెడ్యూల్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలని మూడు ఎమ్మెల్సీ మరియు తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగున్నాయి. నవంబర్ 09 ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువబనుండగా…. నవంబర్ 16 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

ఈ క్రమంలో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరుగురు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసుదనాచారికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆయనకే మండలి చైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతున్నది. గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది. అలాగే గవర్నర్ కోటాలో నామినేట్ ఆమోద ముద్ర లభించని పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పించాలని అనుకుంటున్నారట.

టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్‌రావు, ఎస్సీ సామాజిక వర్గం కోటాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు అవకాశం దక్కనున్నట్లు సమాచారం. ఎస్సీ కోటాలో మరొకరికి కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు దాదాపు ఖరారైనట్లేనని సమాచారం.

మరోవైపు నాగార్జున సాగర్ నియోజకవర్గ నేత ఎంసీ కోటిరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నది. బీసీ సామాజిక వర్గం నుంచి ఎల్.రమణ, కర్నాటి విద్యా సాగర్, పిట్టల రవీందర్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా ఎవర్ని అధికారికంగా తెలుపుతారో చూడాలి.

ఇక పోలింగ్ విషయానికి వస్తే .. నవంబర్ 17వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండనుండగా.. నవంబరు 22వ తేదీన నామినేషన్ల ఉప సంహరణ ఉండనుంది. ఇక నవంబర్ 29 న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా… నవంబర్ 29 వ తేదీ 5 గంటల నుంచి కౌంటింగ్ జరుగనుంది. అదే రోజు ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.