వరుణ్ తేజ్ ‘గని’ ఫస్ట్ డే కలెక్షన్స్

డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ..విజయాలు అందుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..తాజాగా గని పేరుతో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మించగా . వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌‌గా నటించింది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

బాక్సింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కడం , ట్రైలర్ సైతం ఆకట్టుకోవడం తో సినిమా ఫై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడం లో గని విఫలమైంది. మొదటి రోజు మొదటి ఆట తోనే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ టాక్ ప్రభావం సినిమా కలెక్షన్ల ఫై గట్టిగానే పడుతుందని అంటున్నారు . ఇక మొదటి రోజు గ‌ని సినిమాకు మూడు కోట్ల రూపాయ‌ల మేర క‌లెక్ష‌న్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెపుతున్నారు.