అద్వానీ పుట్టిన రోజు వేడుక‌ల్లో ఉప రాష్ట్రపతి, ప్ర‌ధాని

శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి వచ్చిన ప్రముఖులు

న్యూఢిల్లీ : భార‌త మాజీ డిప్యూటీ ప్ర‌ధాని ఎల్‌కే అద్వానీ 94వ పుట్టిన రోజు ఇవాళ‌. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు.. అద్వానీ ఇంటికి వెళ్లి బ‌ర్త్‌డే గ్రీటింగ్స్ తెలిపారు. అద్వానీతో బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేయించారు. అద్వానీకి సుదీర్ఘ‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని ప్ర‌సాదించాల‌ని ప్ర‌ధాని మోడీ ప్రార్థించారు.

మరోవైపు మోడీ ట్విట్టర్ ద్వారా కూడా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘గౌరవనీయులైన అద్వానీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. దేశ ప్రజలను చైతన్యపరచడంలో, మన సంస్కృతి విస్తరింపజేయడంలో ఆయన చేసిన కృషి చాలా గొప్పది. ఆయన మేధో సంపత్తి ఎంతో గర్వించదగినది’ అని మోడీ తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/