పవన్ కళ్యాణ్‌పై ఎమ్మెల్యే ఆళ్ల తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబునాయుడు కొత్త బినామీ పవన్ కళ్యాణ్

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైఎస్ఆర్సిపి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు కొత్త బినామీ పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నో అక్రమాలు చేశారని దుయ్యబట్టారు. అర్థరాత్రి చంద్రబాబు నివాసం వద్ద కరకట్టకు వెళ్లి వపన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడని ఆరోపించారు. పవన్ ప్యాకేజీ తీసుకున్నాడనాటానికి నిదర్శనమే మంగళగిరిలో జనసేన పార్టీ ఎవరినీ పోటీకి పెట్టకపోవడమని దీనిని బట్టి చూసై పవన్ నిజస్వరూపం అర్ధం అవుతుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇంకా కృష్ణా, గుంటూరు జిల్లా వాసులు అన్ని రంగాల్లో ముందన్నారని ఈ సందర్భంగా తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వాళ్లు కూడా అభివృద్ధి చెందాలని అందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆళ్ళ తెలిపారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/