ఎమ్మెల్యే కోటంరెడ్డితో మాజీ మంత్రి అనిల్ యాదవ్ భేటీ
మంత్రి పదవి దక్కని బాధలో కోటంరెడ్డి

అమరావతి: నెల్లూరు జిల్లాలో మంత్రి పదవిని ఆశించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..తనకు మంత్రి పదవి రాకపోవడంతో మీడియా ముందే కన్నీటిపర్యంతమైన సంగతి తెలిసిందే. అదే జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు కూడా జగన్ రెండో సారి అవకాశం ఇవ్వలేదు. అయితే వీరిద్దరితో విభేదాలు ఉన్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రిగా అవకాశం దక్కింది.
ఈ క్రమంలో ఇప్పుడు కోటంరెడ్డితో అనిల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రస్తుతం గడపగడపకు కోటంరెడ్డి పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో బిజీగా ఉన్న కోటంరెడ్డిని అనిల్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి వరుసగా మూడో మారు కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించాలని అనిల్ ఆకాంక్షించారు. మొత్తంగా కాకాణికి మంత్రి పదవి దక్కిన నేపథ్యంలో కోంటరెడ్డి, అనిల్ కుమార్‌ల భేటీపై నెల్లూరులో కొత్త చర్చ మొదలైంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/