బీబీనగర్‌ టోల్‌ప్లాజా సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం

శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌ టోల్‌ప్లాజా సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పూల లోడుతో వెళ్తున్న ట్రాలీ ఆటో..టోల్‌గేట్‌ సమీపంలో ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఉద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం ధాటికి ట్రాలీ ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని , ఘటన వివరాలు తెలుసుకున్నారు.

ఈ ఘటన లో మృతి చెందిన వారు పర్వతగిరి మండలం తోటపల్లికి చెందిన అనిల్‌, వరంగల్‌కు చెందిన ఖలీల్‌గా గుర్తించారు. ఇక అదే సమయంలో పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఘటన విషయాన్నీ తెలుసుకొని..అక్కడే కాసేపు ఆగి.. దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన విషయాలను తెలుకున్నారు. మృతులకు సంబంధీకులతో మాట్లాడి విచారం వ్యక్తంచేశారు. రోడ్లపై ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు.