జనసేన ఎమ్మెల్యే ను రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మకు పరిచయం చేసిన జగన్

రాష్ట్రపతి ఎన్నికల్లో NDA తరుపున ద్రౌపది ముర్మ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పార్టీలు తమ మద్దతును ద్రౌపది ముర్మకు తెలుపగా..తాజాగా వైస్సార్సీపీ తో పాటు టీడీపీ పార్టీలు సైతం ద్రౌపది ముర్మ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో నిన్న మంగళవారం ద్రౌపది ముర్మ ఏపీలో పర్యటించారు. ముందుగా వైస్సార్సీపీ పార్టీ నేతలను కలిసిన ఆమె ఆ తర్వాత టీడీపీ నేతలను కలిశారు. ఈ సందర్బంగా ఇరు పార్టీల అధినేతలు తమ ఎమ్మెల్యే లను ద్రౌపది ముర్మకు పరిచయం చేసారు. ఈ క్రమంలో జనసేన పార్టీ నుండి గెలిచినా రాపాక వరప్రసాద్ ను సీఎం జగన్ ద్రౌపది ముర్మకు పరిచయం చేసారు.

జనసేన నుండి గెలిచినా ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక. జనసేన నుండి గెలిచినప్పటికీ వైస్సార్సీపీ పార్టీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య రాపాక .. ద్రౌపది ముర్మను కలిశారు. ఆమెకు తన మద్దతును తెలియజేశారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి రాపాక హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను వైఎస్ జగన్ ప్రత్యేకంగా- ద్రౌపది ముర్ముకు పరిచయం చేశారు. ఆ సమయంలో రాపాక భుజంపై చేతులు వేసి ఆప్యాయంగా ఆయన గురించి ముర్ముకు వివరించడం కనిపించింది.