మంత్రి రోజా కూతురికి అరుదైన పురస్కారం

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా కూతురు అన్షు మలిక సెల్వమణికి అరుదైన పురస్కారం దక్కింది. ఉత్తమ రచయిత కేటగిరీలో ఆమె రాసిన బుక్ ఎంపికైంది. ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ పేరుతో ఈమె బుక్ రాసింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి అందిన పుస్తకాల్లో ఇదొక్కటే ది బెస్ట్ అనిపించుకుంది. బెస్ట్ ఆథర్ అవార్డ్ కోసం అన్షు ఎంపికయ్యారు. కోల్‌కతలో నిర్వహించిన కార్యక్రమంలో అన్షు ఈ అవార్డును అందుకున్నారు.

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ప్రముఖ బాలీవుడ్ నటి షాజాన్ పదామ్సీ, అన్షు మాలికకి అవార్డును అందించింది. రచయిత్రిగా తాను ఈ స్థాయికి ఎదగడానికి అందరి ఆశీస్సలు కారణమని అన్షు పేర్కొంది. అసలు అన్షు రచయిత్రి అవుతుందని తాను అనుకోలేదనీ, ఆమె సాధిస్తున్న విజయాలు తనకెంతగానో ఆనందాన్ని ఇస్తున్నాయని కొన్నాళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో రోజా వెల్లడించిన విషయం విదితమే. అతి చిన్న వయసులోనే తన మంచి మనసు చాటుకున్న అన్షు మలికను కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.