వాళ్లు పార్టీని వీడినంతా మాత్రాన తమకు వచ్చే నష్టమేమీ లేదు – బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీల్లో వలసల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే టిఆర్ఎస్ పార్టీ ని వీడి , బిజెపి లో చేరిన నేతలు మళ్లీ సొంతగూటికి వస్తున్నారు. తాజాగా దాసోజు శ్రావణ్ తో పాటు స్వామి గౌడ్ టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు మరికొంతమంది సైతం టిఆర్ఎస్ లో చేరబోతారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో బిజెపి ని వీడి టిఆర్ఎస్ లో చేరిన నేతలపై పరోక్షంగా విమర్శించారు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు. వారు పార్టీని వీడినంతా మాత్రాన తమకు వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. కార్యకర్తలే తమ బలమని ఎంత మంది వచ్చి వెళ్లినా.. బీజేపీ దూకుడును ఆపలేరన్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను బ్రేక్ చేయలేరని.. మరో ‘ఆర్‌’ను ఆపలేరంటూ రఘునందన్ రావు వ్యాఖ్యనించారు. మునుగోడు నుంచి ఇంకొక ఆర్‌ను గెలిపించుకొని అసెంబ్లీకి నాలుగో ఆర్‌ను తీసుకుని పోతా. మూడు ఆర్‌లను బ్రేక్ చేయలేరు. నాలుగో ఆర్ రాకను ఆపలేరు.’ అని రఘనందన్‌రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాగానే భయంతో హడావుడిగా అభివృద్ధి పనులు చేపట్టారని టీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు.