భగవంత్ కేసరి టీజర్ టాక్ : భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది

నందమూరి బాలకృష్ణ – కాజల్ జంటగా శ్రీలీల కీలక పాత్రలో తెరకెక్కుతున్న మూవీ భగవంత్ కేసరి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా.. స్ర్కీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది.

ఈరోజు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ఈ టీజర్ ను విడుదల చేయగా..అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ‘రాజు తన వెనక ఉన్న వందల మంది మందను చూపిస్తాడు మొండేడు తనకు ఉన్న గుండెను చూపిస్తాడు’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ తో టీజర్ మొదలైంది. టీజర్ మొత్తం సరికొత్త గా ఉంది. ముఖ్యంగా భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది అంటూ తెలంగాణ యాస లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ టీజర్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. అభిమానులు బాలయ్య నుండి ఏం కోరుకుంటున్నారో..డైరెక్టర్ అవన్నీ చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. మీరు కూడా ఈ టీజర్ ఫై లుక్ వెయ్యండి.

YouTube video