‘చుక్క’ లేక వచ్చిన తంటా !: ‘ఎర్రగడ్డ’కు 100 ఓ పి కేసులు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పెరుగుతున్న రోగులు

Erragadda Hospital

Hyderabad: లాక్‌ఔట్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలను మూసి ఉంచడంతో మద్యం ప్రియులు తాగడానికి మద్యం దొరక్కవెర్రెత్తి పోతున్నారు.

కొందరు మానసిక అనారోగ్యానికి గురికావడంతో నగరంలోని ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రి (మెంటల్‌ హాస్పిటల్‌)కు క్యూ కడుతున్నారు.

దీంతో రోజు రోజుకూ ఇక్కడికి ఓపీ కేసులు పెరుగుతున్నాయని ఎర్రగడ్ద మానసిక వైద్యశాల సూపరిండెంట్ డా. ఉమా ఉమా శంకర్ తెలిపారు.

సాధారణ రోజుల్లో రోజుకు 30 నుంచి 40 కేసులు వస్తే అందులో 4 కేసులు మాత్రమే మద్యం కేసులు ఉండేవని, కానీ తెలంగాణ లాక్‌డౌన్‌ నేపధ్యంలో రోగులు సంఖ్య పెరుగుతోందని, సోమవారం ఒక్కరోజే మద్యానికి సంబంధించి 100 ఓపీ కేసులు వచ్చినట్టు తెలిపారు.

గత రెండు రోజులుగా హాస్పిటల్‌కు భారీగా ఓపీకేసులు నమోదవుతున్నాయని అన్నారు. వచ్చిన వారందరికీ చికిత్స చేస్తున్నామని, అవసరమైన వారిని అడ్మిట్‌ చేసుకుంటున్నట్టు వెల్లడించారు.

ప్రతి రోజూ మద్యం, కల్లు తాగడం వల్ల ఒక్కసారిగా వారికి తాగడానికి దొరక్కపోవడంతో వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నారు.

ఎక్కువగా క్లోరోఫామ్‌, డైజీఫామ్‌ వాడడం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. మందు దొరక్కపోవడం వల్ల ఇది వారిలో 24గంటల్లోనే ప్రభావం చూపుతుందన్నారు.

రాష్ట్రంలోని ఆయా జిల్లాల వారు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేదని, ఆయా జిల్లాల్లోనూ హాస్పిటల్స్‌ ఉన్నాయని వివరించారు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health/