కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్న పూతలపట్టు ఎమ్మెల్యే?

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వలసల పర్వం ఊపందుకుంటుంది. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తూ టిడిపి , జనసేన లలో చేరుతుండగా…మరికొంతమంది కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి..షర్మిల తో అడుగులేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇదే బాటలో పూతలపట్టు ఎమ్మెల్యే సైతం నడవబోతున్నట్లు వినికిడి.

వైసీపీ అధిష్ఠానం ఆయనకు ఈసారి టికెట్ కేటాయించలేదు. దీంతో ఆయన పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేశారు. రెండ్రోజుల క్రితం తిరుమల వచ్చిన కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఓఎస్టీ గోపాలప్పను ఆయన కలిశారు. నియోజకవర్గంలోని కొందరు వైసీపీ నాయకులతో కలిసి గోపాలప్పతో బాబు చర్చించారు. త్వరలోనే ఈయన కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గరి నుండి వైస్ అభిమానులు , కాంగ్రెస్ నేతలు , అభిమానులు షర్మిల వెంట నడిచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. షర్మిల సైతం తన దూకుడు కనపరుస్తూ హడావిడి చేస్తున్నారు. వరుసగా పర్యటనలు , సమావేశాలు జరుపుతూ వస్తున్నారు.