ప్రాణహిత పుష్కరాల్లో అపశ్రుతి..నీటిలో మునిగి విశాఖవాసి మృతి

ప్రాణహిత పుష్కరాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద పుణ్యస్నానం కోసం నదిలోకి దిగిన వ్యక్తి నీటిలో మునిగి ప్రాణాలు వదిలాడు. మృతుడిని విశాఖపట్నంకు చెందిన గుడ్ల సోమేశ్‌గా గుర్తించారు. నీటిలో మునగడం గుర్తించిన భక్తులు అధికారులకు సమాచారం ఇవ్వగా..వారు వెంటనే గజ ఈతగాళ్లును నీటిలోకి పంపారు. కానీ అప్పటికే సదరు వ్యక్తి మరణించాడు. ఈ ఘటన తో అర్జునగుట్ట వద్ద విషాదం నెలకొనుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ..మృతుని సబంధీకులకు సమాచారం అందించారు.

పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల సమయంలో పుణ్యనదిలో స్నానమాచరిచడం, పితృదేవతలకు పిండ ప్రధానం చేయడం వంటివి చేస్తుంటారు. అయితే తెలంగాణ లో ప్రవహిస్తున్న ప్రాణహిత నది పుష్కరాలు బుధవారం నుంచి మొదలు కాగా.. ఈనెల 24వ తేది వరకు అంటే 12రోజుల పాటు నిర్వహించబడతాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రానికి సమీపంలో ప్రాణహిత పుష్కరాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గత రెండు రోజులుగా పలు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పుణ్య స్నానమాచరిచడం చేస్తున్నారు.