తెనాలి వైద్య‌శాల‌లో క‌రోనా ప‌రీక్ష‌ల‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ‘అన్నాబ‌త్తుని’

ఇబ్బందిగా ఉన్నయెడల టెస్టులు చేయించుకోవాలని సూచన

ML A Shiva Kumar started the Covid-19 Tests
MLA Annabattuni Shiva Kumar started the Covid-19 Tests

Tenali: తెనాలి ప్ర‌భుత్వ వైద్య‌శాల‌లో క‌రోనా నిర్ధార‌ణ (కోవిడ్‌-19) ప‌రీక్ష‌ల‌ను తెనాలి ఎమ్మెల్యే అన్నాబ‌త్తుని శివ‌కుమార్ ప్రారంభించారు .

జిల్లాలో రోజు రోజుకీ పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా తెనాలి జిల్లా ప్ర‌భుత్వ వైద్య‌శాల‌లోనూ టెస్టింగ్ సెంట‌ర్‌ను ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు.

 టెస్టుకు సంబంధించిన ప‌రిక‌రాలు ట్రూనాట్ మిష‌న్లు అందుబాటులో ఉన్న‌ట్టు తెలిపారు.

స్వాబ్ తీసిన రెండు గంట‌ల్లోనే ఫ‌లితాలు వెల్ల‌డిస్తామ‌న్నారు.రోజుకు 80 టెస్టులు చేసే అవ‌కాశం ఉంటుంద‌ని ఎమ్మెల్యే అన్నాబ‌త్తుని పేర్కొన్నారు.

బాప‌ట్ల, రేప‌ల్లె, పిట్న‌వానిపాలెం, మాచ‌ర్ల నుండి ట్రూనాట్ మిష‌న్లు వ‌చ్చిన‌ట్టు చెప్పారు.  

ఈ ప‌రీక్ష‌లు చేయించుకునేందుకు వ‌చ్చే వారు త‌ప్ప‌నిస‌రిగా ఆధార్ కార్డును త‌మ వెంట తీసుకురావాల‌ని పేర్కొన్నారు.

ప్ర‌భుత్వం ఆరు క్రైటీరియాల్లో ఏ ఒక్క ల‌క్ష‌ణం ఉన్నా వారికి ఈ కోవిడ్ – 19 ప‌రీక్ష‌లు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

ద‌గ్గు, గొంతునొప్పి, జ‌లుబు, జ్వ‌రం ఎక్కువ‌గా క‌లిగి ఉన్న‌వాళ్ళు, ఇత‌ర దేశాల నుండి వ‌చ్చిన వాళ్ళు, పాజిటివ్ క‌లిగిన వ్య‌క్తుల కుటుంబాల్లో ఉన్న‌ వాళ్ళుకు  ప్ర‌స్తుతం తెనాలి ప్ర‌భుత్వ వైద్య‌శాల‌లో కోవిడ్ – 19 ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు.

రిజ‌ల్స్ రావ‌డానికి ప‌ట్టే రెండుగంట‌ల వ‌ర‌కు టెస్టింగ్ చేయించుకున్న వారిని వైద్య‌శాల‌లోని ఐసొలేటెడ్ వార్డులో ఉంచుతున్న‌ట్టు చెప్పారు.

తెనాలి గ్రీన్‌జోన్‌గా ఉండ‌టం ఎంతో మంచి ల‌క్ష‌ణ‌మ‌ని, ఎవ‌రికైనా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఉన్నాయ‌ని అనుకుంటే వెంట‌నే టెస్టింగ్ చేయించుకోవాల‌ని సూచించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌ల కోసం బాప‌ట్ల‌, గుంటూరుల‌కు పంపాల్సి ఉండేద‌ని, అయితే ఈ టెస్టింగ్ తెనాలిలోనే అందుబాటులోకి రావ‌డం వ‌ల్ల తెనాలి ప్ర‌జ‌ల‌కు ఎంతో అవ‌కాశం ల‌భించింద‌న్నారు.

టెస్టింగ్ మిష‌న్ల‌తో పాటు ట్రైన్‌డ్ స్టాఫ్‌ని కూడా వైద్య‌శాల‌కు పంపిన‌ట్టు ఎమ్మెల్యే అన్నాబ‌త్తుని శివ‌కుమార్ వెల్ల‌డించారు.

ప్ర‌జ‌లు అధైర్య ప‌డొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు అండ‌గా ప్ర‌భుత్వం, ప్ర‌జాప్ర‌తినిధులు, వైద్యులు, మున్సిప‌ల్‌, రెవిన్యూ సిబ్బంది నిరంత‌రం క‌రోనాను అరిక‌ట్టేందుకు కృషి చేస్తున్న‌ట్టు చెప్పారు.

ఇప్ప‌టి వ‌ర‌కు తెనాలిలో క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌న్పించ‌లేద‌ని, ఇది మ‌న అదృష్ట‌మంగా తెలిపారు.

దీనిని క‌పాడుకోవాల్సిన బాధ్య‌త ఉంద‌ని, అంద‌రూ లాక్‌డౌన్‌ను పాటించి ఇంటికే ప‌రిమిత‌మ‌వ్వాల‌ని, అదే విధంగా ప్ర‌భుత్వం నిర్ధేశించిన సూత్రాల‌ను పాటించాల‌ని కోరారు.

మాస్క్‌ని, సామాజిక దూరాన్ని ప్ర‌తి ఒక్క‌రూ పాటించాల‌ని కోరారు.

ఈయ‌న వెంట వైద్య‌శాల అభివృద్ది క‌మిటీ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ ప్ర‌తాప్‌, వైద్య‌శాల మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ స‌న‌త్‌కుమారి, ఆర్‌.ఎం.వో. డాక్ట‌ర్ పి.ఎస్‌. ప్రేమ్‌కుమార్ త‌దిత‌రులు ఉన్నారు.   

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/