ఏపీలో మరో 71 మందికి కరోనా పాజిటివ్

Corona Cases in Andhra Pradesh
Corona Cases in Andhra Pradesh

అమరావతి : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 6,497 మంది శాంపిళ్లను పరీక్షించగా 71 మందికి కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,403గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 321 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారని వివరించింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,051గా ఉందని తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 3, చిత్తూరులో 3, తూర్పుగోదావరిలో 2, గుంటూరులో 4, కడపలో 4, కృష్ణాలో 10, కర్నూలులో 43, నెల్లూరులో 2 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలులో మొత్తం కేసులు 386కు చేరాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/