ఆ తప్పు జరగడం తో రాజమౌళి కాళ్లకు దండం పెట్టబోయిన అలియా భట్

ముంబై లో జరిగిన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. అలియాభట్..దర్శక ధీరుడి కాళ్లకు దండం పెట్టబోయింది. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ , రామ్ చరణ్, అజయ్ దేవగన్ , అలియా భట్ , శ్రీయ వంటి స్టార్ నటి నటులే కాదు హాలీవుడ్ నటులు సైతం ఈ మూవీ లో నటించారు. జనవరి 07 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో ఈరోజు ఈ చిత్ర ట్రైలర్ ను పలు భాషల్లో విడుదల చేసి ఆకట్టుకున్నారు. ఈ ట్రైలర్ చూసి ప్రతి ఒక్కరు గర్వపడుతున్నారు.

అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అలియా భట్, రాజమౌళి, అజయ్ దేవగణ్, ఎన్టీఆర్, దానయ్య కలిసి పాల్గొన్నారు. అయితే రాజమౌళి, అలియా భట్ పక్కపక్కనే కూర్చున్నారు. అయితే ఈ క్రమంలో అలియా భట్ కాలు మీద కాలు వేసుకుని కూర్చునేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో రాజమౌళికి అలియా భట్ కాళ్లు తగిలాయి. అలా తగిలాయి కదా? అని వదిలేయలేదు.. ఏ మాత్రం గర్వలేని మంచి మనిషిలా అలియా భట్.. రాజమౌళి కాళ్లకు దండం పెట్టబోయింది. కానీ రాజమౌళి మాత్రం వద్దని అలా ఆపేశాడు. దీని తాలూకా వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.