ఈ పిల్లాడిని మిస్ అవుతున్నా..కెటిఆర్ భావోద్వేగం

అమెరికాలో చదువుకుంటున్న కెటిఆర్ తనయుడు హిమాన్షు

missing-this-kid-says-ktr-shares-pic-with-his-son

హైదరాబాద్‌ః తన కుమారుడు హిమాన్షు ఫొటోను నెట్టింట పంచుకున్న తెలంగాణ మంత్రి కెటిఆర్ అతడిని మిస్సవుతున్నానంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై పెద్ద ఎత్తున స్పందిస్తున్న అభిమానులు.. హిమాన్షు కూడా ఇలాగే ఫీలవుతుంటాడని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అతడు కంటికెదురుగా లేకపోవడంతో తండ్రిగా కెటిఆర్ కు బాధ అనిపించినా భవిష్యత్తులో కుమారుడి విజయాలు చూసి మురిసిపోతారని కామెంట్ చేశారు.

ఉన్నత చదువులకోసం హిమాన్షు అమెరికాకు వెళ్లడం జరిగింది. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ అనంతరం అతను ఈ ఆగస్టులో అమెరికాకు వెళ్లారు. ఆయన వెంట కెటిఆర్-శైలిమ దంపతులు, చెల్లి అలేఖ్య కూడా వెళ్లారు. ఈ క్రమంలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తయ్యాక వారం రోజులకు కెటిఆర్ తన కుటుంబంతో కలిసి ఇండియాకు తిరిగొచ్చారు.

చదువు పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం స్కూల్లో జరిగిన గ్రాడ్యూయేషన్ డే వేడుకలకు తాత, నాయనమ్మ కెసిఆర్, శోభ దంపతులు తల్లిదండ్రులు కెటిఆర్, శైలిమ, చెల్లి అలేఖ్య కూడా హాజరయ్యారు. సామాజిక సేవలో ముందుండే హిమాన్షుకు అప్పట్లో సీఏఎస్ ఎక్సలెన్స్ అవార్డు కూడా లభించింది.