ఇరాన్‌ చిక్కుకున్న 250 మంది భారతీయులకు కరోనా !

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన

250 indians In Iran Test Coronavirus Positive
250 indians In Iran Test Coronavirus Positive

ఇరాన్‌: ఇరాన్‌లో చిక్కుకున్న దాదాపు 254 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌లో ఆదివారానికి 13,938 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, 724 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు వెళ్లిన జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రాంతాలకు చెందిన 1,100 మంది యాత్రికుల బృందంలో 254 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. విదేశాల్లోని భారతీయుల యోగక్షేమాల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ కొత్తగా ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/