ట్రంప్ కు తప్పిన ప్రమాదం : విమానం అత్యవసర ల్యాండింగ్

భద్రతా కారణాల రీత్యా పూర్తి వివరాలు వెల్లడించని అధికారులు

Missed risk to Trump- Plane emergency landing
Missed risk to Trump- Plane emergency landing

యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ​ట్రంప్​కు ప్రమాదం తప్పింది. ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం కలగటంతో ఓర్లియాన్స్ అధికారులు అత్యవరసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. మెక్సికో గగనతలం మీదుగా ప్రయాణిస్తుండగా , ఒక్కసారిగా ఇంజిన్ ​ ఆగిపోవటంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు తెలిసింది. ఈ ఘటన గతవారం జరిగినప్పటికీ విషయం ఆలస్యంగా ఇపుడు బయటకు వచ్చింది.

ఇదిలా ఉండగా, ఈ విషయాన్ని అక్కడి ఒక వార్తా సంస్థ ముందుగా ప్రచురించింది. ఇపుడు , సంబంధిత అధికారి సైతం ధృవీకరించినట్టు సమాచారం . కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలను భద్రతా కారణాల రీత్యా వెల్లడించలేదు. న్యూ ఓర్లియాన్స్​లో గత శనివారం జరిగిన రిపబ్లికన్​ నేషనల్​ కమిటీ డోనార్​ రిట్రీట్​కు హాజరై.. తిరిగి ఫ్లోరిడా ఎస్టేట్​కు వస్తుండగా రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంజిన్​ ఆగిపోయింది. ఆ సమయంలో ట్రంప్ తో పాటు ఆయన సలహాదారులు, నిఘా అధికారులు ఆయనతో పాటు ఉన్నారు.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/