ఉత్తరప్రదేశ్ లో దారుణం : పదో తరగతి విద్యార్థిని ఫై గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్ లో మహిళలకు ఏమాత్రం రక్షణ ఉండదని మరోసారి రుజువైంది. ఇప్పటీకే ఎన్నో ఘటనలు ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూడగా..తాజాగా పదో తరగతి విద్యార్థిని ఫై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ సహారన్​పుర్​ జిల్లాలో జరిగింది.

ఇంటి ముందు కూర్చుని ఉన్న సదరు బాలిక ను పొరుగున ఉన్న ఓ యువకుడు, అతని సోదరుడు వెళ్లి.. తుపాకీతో బెదిరించి అపహరించారు. బాధితురాలిని తమ ఇంటికి తీసుకెళ్లి.. ఆమెకు మత్తుమందు ఇచ్చి, అత్యాచారం చేశారు. కొద్ది సమయం తర్వాత స్పృహలోకి వచ్చిన బాలిక.. తిరిగి ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికకు వైద్యపరీక్షలు చేయించి, విచారణ చేపట్టారు.