ఏటీఎం విత్‌డ్రాయల్స్‌పై RBI బాదుడు

ఏటీఎం విత్‌డ్రాయల్స్‌పై RBI బాదుడు

కొత్త ఏడాది లో బ్యాంకు కస్టమర్లఫై వీర బాదుడు బాదేందుకు RBI సిద్ధమైంది. ఏటీఎం విత్‌డ్రాయల్స్‌పై కండిషన్స్ పెట్టింది. నెలవారీ ఫ్రీ లిమిట్ దాటి ఏటీఎం ట్రాన్సాక్షన్లు చేసే కస్టమర్లపై భారీ చార్జీలు మోపేందుకు నిర్ణయం తీసుకుంది.

2022 జనవరి 1 నుంచి నెలవారీ ఫ్రీ లిమిట్ దాటి ఏటీఎం ట్రాన్సాక్షన్లు చేసే కస్టమర్లపై అధిక చార్జీలు వసూళ్లు చేయబోతుంది. క్యాష్ ట్రాన్సాక్షన్లతో పాటు, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్లపైనా ఉండనుంది. ప్రతి కస్టమర్‌‌కు తన బ్యాంక్‌కు చెందిన ఏటీఎంలలో ఐదు ట్రాన్సాక్షన్ల వరకూ ఫ్రీ ఇచ్చింది. ఈ ఐదులోకి బ్యాలెన్స్ చెకింగ్, మనీ విత్‌డ్రాయల్స్, మినీ స్టేట్‌మెంట్, పిన్ చేంజ్‌ ఇలా ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే కౌంట్‌లోకి వస్తున్నట్లు తెలిపింది.

అలాగే మెట్రో సిటీల్లో అయితే మూడు అదర్ బ్యాంక్ ఏటీఎం ట్రాన్సాక్షన్లు, నాన్ మెట్రో సిటీల్లో ఐదు అదర్ బ్యాంకు ట్రాన్సాక్షన్లు ఫ్రీ ఉంటాయి. ఈ కొత్త కండిషన్ ప్రకారం నెలవారీ ఫ్రీ లిమిట్ దాటి.. ఏటీఎంలో ట్రాన్సాక్షన్ చేస్తే కస్టమర్ అకౌంట్‌ నుంచి 21 రూపాయల చార్జ్, అదనంగా జీఎస్టీని బ్యాంకు కట్ చేసుకుంటుంది. మొత్తం మీద కొత్త ఏడాది లో అడుగుపెట్టేవారికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.