జయప్రకాశ్ రెడ్డి మరణానికి ప్రధాని సంతాపం

ఎన్నో మరపురాని పాత్రలు పోషించారన్న మోడి

జయప్రకాశ్ రెడ్డి మరణానికి ప్రధాని సంతాపం
actor Jaya Prakash Reddy-pm modi

న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఈ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై ప్రధాని మోడి ట్వీటర్‌లో స్పందించారు. జయప్రకాశ్ రెడ్డి గారు తనదైన నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారని తెలిపారు. తన దీర్ఘకాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారని, వారి మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జయప్రకాశ్ రెడ్డి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను… ఓం శాంతి అంటూ స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల ట్వీట్ చేశారు.


కాగా జయప్రకాశ్ రెడ్డి కొంతకాలంగా గుంటూరులోని తన నివాసంలోనే ఉంటున్నారు. ఈ తెల్లవారుజామున ఛాతీలో నొప్పితో బాత్రూంలోనే కుప్పకూలిపోయారు. జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/