పాతబస్తీలో దారుణం : మంత్రాల పేరుతో ఇద్దరు యువతులపై ఓ బాబా అత్యాచారం

పాతబస్తీలో దారుణం : మంత్రాల పేరుతో ఇద్దరు యువతులపై ఓ బాబా అత్యాచారం

రోజు రోజుకు టెక్నలాజి అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొంతమంది మాత్రం ఇంకా మూఢనమ్మకాల నుండి బయటపడడం లేదు. ఏ మారుమూల గ్రామంలోనే కాదు హైదరాబాద్ మహానగరం లో కూడా ఇలాంటి ముద్ర నమ్మకాలను బాగా నమ్ముతున్నారు. ఈ నమ్మకాలను క్యాష్ చేసుకొని కొంతమంది దొంగబాబాలు దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీ లో ఓ దొంగబాబా మంత్రాల పేరుతో ఇద్దరు యువతులపై అత్యాచారం చేసాడు.

వివరాల్లోకి వెళ్తే..

పాతబస్తీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యానికి గురైన తల్లిని కాపాడుకునేందుకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఓ బాబాను ఆశ్రయించారు. అక్కాచెల్లెళ్ల ఫై కన్నేసిన ఆ బాబా..యువతులపై మంత్రాల నెపంతో అత్యాచారానికి తెగబడ్డాడు. అనంతరం అందులోని ఓ యువతికి పెళ్లి కాగా…ఆమెకు విడాకులు ఇప్పించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ వివాహితపై బాబా కుమారుడు సైతం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇద్దరు యువతులను శారీరకంగా, మానసికంగా వాడుకోవడమే కాకుండా ఆర్థికంగానూ దొంగబాబా కుంగదీశాడు. దీంతో బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించగా… బాబా, అతడి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.