రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వవైభవం

ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

minister srinivas goud participated haritha haram program

రంగారెడ్డి: ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగ జిల్లాలోని నందిగామ మండలం చేగూరు గ్రామంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ  కార్యక్రమంలో 4 వేల ఈత మొక్కలను మంత్రి, స్థానిక పార్లమెంట్ సభ్యుడు మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో కుల వృత్తులకు సిఎం కెసిఆర్‌ ‌ పూర్వ వైభవం తీసుకొస్తున్నారని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్‌ పాలనలో కులవృత్తులు చేసుకునే వారు ఆత్మగౌరవంతో బతికేలా సిఎం కెసిఆర్‌ పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యుడు అంజయ్య యాదవ్, స్థానిక మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మంచన్ పల్లి ప్రియాంక శివశంకర్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్ వై ఖురేషీ, రఘురాం, సిబ్బంది పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/