కేసీఆర్ కు త్వరలో జైలు ఖాయం : బండి సంజయ్

సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలు, వారం రోజులుగా కేసీఆర్ కేసుల పైనే ఆరా

Bandi Sanjay criticisms on KCR
Bandi Sanjay criticisms on KCR

Hyderabad: తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన్ని ఎప్పుడు జైలుకు పంపించాలనే దానిపై తమ వ్యూహం తమకుందని పేర్కొన్నారు. బుధవారం మీడియాతో సంజయ్ మాట్లాడారు. టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వివరాలను పూర్తిగా సేకరించామని అన్నారు. . ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 18 మంది ముఖ్యనేతలపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నామని తెలిపారు.
సీఎం కేసీఆర్ సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలు పూర్తిగా తీస్తున్నాం. వారం రోజులుగా సీఎం కేసీఆర్ కేసుల పైనే ఆరా తీస్తున్నామని తెలిపారు. . ఈ స్కాంలు చూశాకే సీఎం కేసీఆర్ ఎంత పెద్ద అవినీతిపరుడో తేలిపోయిందని అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వారం రోజుల్లో బీజేపీలో చేరతారని, ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. . ఎలాంటి హామీ లేకుండానే ఈటల బీజేపీలో చేరుతున్నారని , ఆయనే కాదు, బీజేపీలో ఎవరు చేరినా.. ఎలాంటి హామీ ఉండదన్నారు. . బీజేపీ సిద్ధాంతాలతో పాటు ప్రధాని మోదీ పాలన నచ్చి ఈటల బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/