కరోనా నియంత్రణలో ఆస్ట్రేలియా కీలక నిర్ణయం

100 ఏళ్ల తర్వాత మళ్లీ మూతపడనున్న ఆ రాష్ర్టాల సరిహద్దులు

Australia To Close State Border For First Time In 100 Years

సిడ్నీ: కరోనా మహమ్మారి నియత్రణ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విక్టోరియా రాజధాని మెల్‌బోర్న్‌లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో సుమారు వంద సంవత్సరాల తర్వాత న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల మధ్య మంగళవారం నుంచి సరిహద్దులు మూసేస్తున్నట్లు విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ ప్రకటించారు. ఇరు రాష్ర్టాల సరిహద్దులను ఈ రోజు రాత్రి 11.59 గంటలకు నిరవధికంగా మూసివేస్తామని చెప్పారు. విక్టోరియా రాజధాని అయిన మెల్‌బోర్న్‌ కరోనాకు కేంద్రంగా మారింది. దీంతో రాష్ట్రంలో ఒక్కరోజులో 127 కేసులు నమోదయ్యాయి. గత రెండు వారాల్లో దేశంలో ఇంతపెద్దసంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. కరోనాతో నిన్న ఒకరు మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 105కు చేరింది. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని ఆండ్రూస్‌ సూచించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/