మంత్రి సత్యవతి రాథోడ్ కీలక కామెంట్స్

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కీలక కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ అవకాశమిస్తే.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున డోర్నకల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు హైదరాబాద్లోని ఖైరతాబాద్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి ఈ కామెంట్స్ చేసారు. తన రాజకీయ జీవితం డోర్నకల్ నుంచే ప్రారంభమైందని.., పార్టీ ఆదేశిస్తే తప్పకుండా అక్కడి నుంచే పోటీ చేస్తానని అన్నారు.

“నా రాజకీయ ప్రస్థానం డోర్నకల్ నుంచే మెుదలైంది. నేను ఇవాళ మీ ముందు మంత్రిగా నిలబడి మాట్లాడుతున్నానంటే అది డోర్నకల్ ప్రజల ఆశీర్వాదమే. నన్ను డోర్నకల్ నుంచి పోటీ చేయమని చాలా మంది అడుగుతున్నారు. మీ అభిమానికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నాకు పార్టీ ఆప్షన్ ఇస్తే డోర్నకల్ మాత్రమే ఎంచుకుంటా. అక్కడి నుంచి మాత్రమే పోటీ చేస్తా. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే నేను డోర్నకల్ నుంచి పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నా.” అని సత్యవతి రాథోడ్ వ్యాఖ్యనించారు. మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్లతో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు టెన్షన్ మెుదలైంది. ప్రస్తుతం డోర్నకల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీకే చెందిన రెడ్యా నాయక్ ఉన్నారు.